కరోనా కారణంగా హాలీవుడ్‌ మూవీస్ విడుదల వాయిదా..!?

April 11, 2021 at 3:02 pm

హాలీవుడ్‌ బాక్సాఫీస్ ‌పై కరోనా ఎఫెక్ట్‌ బాగా పడింది. దీంతో అని చిత్రాలు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా యాక్షన్‌ హీరో టామ్‌ క్రూజ్‌ నటించిన టాప్‌ గన్‌: మ్యావరిక్, మిషన్‌: ఇంపాజిబుల్‌ ౭ మూవీస్ విడుదల కూడా వాయిదా పడ్డాయి. టాప్‌ గన్‌ చిత్రానికి సీక్వెల్‌గా టాప్‌ గన్‌: మ్యావరిక్ చిత్రం రూపొందింది. ఈ చిత్రం మొదట ఈ ఏడాది జూలై 2న రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు నవంబరు 19కి వాయిదా పడింది.

అలాగే మిషన్‌: ఇంపాజిబుల్‌ 7 సినిమా 2022 నవంబరు 4 నుంచి 2023 జూలై 7కి వాయిదా పడింది. వీటితో పాటుగా ఈ సంవత్సరం జూలై 23న రిలీజ్ కు షెడ్యూల్‌ అయిన స్నేక్‌ ఐస్ సినిమా ఈ ఏడాది అక్టోబరు 22కి వాయిదా అయ్యింది. వీటితో పాటు మరికొన్ని హాలీవుడ్‌ సినిమాలు కూడా వాయిదా అవనున్నాయి. కరోనా కారణంగా ఇండియన్‌ మూవీస్‌ రిలీజ్‌లు కూడా వాయిదా పడుతున్నాయి. తాజాగా ఇప్పుడు హాలీవుడ్‌ చిత్రాలు కూడా ఇదే తోవలో నడుస్తుండటంతో ఎంటైర్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ కరోనా కారణంగా మరోసారి డీలా పడనుంది.

కరోనా కారణంగా హాలీవుడ్‌ మూవీస్ విడుదల వాయిదా..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts