ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏ పాత్ర అయినా సరే అలవోకగా నటించి మెప్పిస్తారు. అందుకే ఆయనను అందరూ లోకనాయకుడు అని పిలుస్తారు. ఒకప్పుడు భారతీయుడు చిత్రంతో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు దానికి సీక్వెల్గా ఇండియన్-2 సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీని మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది.
ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు కేసుల వరుకు వెళ్లిందంటే గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి అర్థం అవుతుంది. దీంతో లైకా నిర్మాతలు శంకర్ ఇండియన్ 2 సినిమా తీసే వరకు ఇంకే మూవీని చేయడానికి ఒప్పుకోం అంటూ కోర్టుకి ఎక్కారు. దీనితో ఈ మూవీ తప్పకుండా పూర్తవుతుందని శంకర్
ఇటీవలే అనౌన్స్ చేశాడు. ఇండియన్ 2 మూవీ కోసం విదేశీ నిపుణులను శంకర్ రప్పిస్తున్నాడని, కాకపోతే కొవిడ్ కారణంగా లేట్ అవుతుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే శంకర్ మొదలు పెడతారని సమాచారం. సినీవర్గాల టాక్.