కోహ్లీసేనకు షాక్.. ఆందోళనలో అభిమానులు…!

April 7, 2021 at 2:51 pm

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభానికి ముందే టోర్నమెంట్‌ పై కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కొంత మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇప్పుడు తాజాగా మరో ప్లేయర్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు డేనియల్ సామ్స్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. ఈ సంగతిని ఆర్సీబీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సామ్స్ ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపారు.

ఆస్ట్రేలియా ఆటగాడు డానియల్ సామ్స్ కి తాజాగా రెండోసారి కరోనా పరీక్షలు జరపగా, పాజిటివ్ అని తేలింది. వెంటనే బీసీసీఐ కోవిడ్ నిబంధనల ప్రకారం సామ్స్‌ను ఐసోలేషన్‌కు పంపారు. ప్రస్తుతం తనని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఇంకా సామ్స్ కంటే ముందు ఆర్సీబీ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌ కరోనా బారిన పడి కోలుకున్నాడు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్, కేకేఅర్ ప్లేయర్ నితీష్ రానా, ముంబై ఇండియన్స్ సలహాదారు కిరణ్ మోర్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.

కోహ్లీసేనకు షాక్.. ఆందోళనలో అభిమానులు…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts