ఐపీఎల్ విన్న‌ర్స్ లిస్ట్ ఇదే..ఈ ఏడాది టైటిల్ ఎవ‌రిదో?

ఐపీఎల్‌(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) 2021 సంద‌డి మొద‌లైంది. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఇప్పటి వరకూ 13 సీజన్లు ముగిశాయి. ఇక‌ చెన్నై వేదికగా ఈ నెల 9న ఐపీఎల్ 14వ సీజ‌న్ ప్రారంభం కాగా.. మే 30న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టనుంది. మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 13 సీజ‌న్స్‌లో ఏ ఏ జ‌ట్టు ఎప్పుడు గెలిచింది అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2008 ఫైన‌ల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ హోరా హోరీగా త‌ల‌ప‌డ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నైను ఓడించి రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టైటిల్ ద‌క్కించుకుంది.

ఐపీఎల్ 2009 పైన‌ల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దక్కన్ ఛార్జర్స్ పోటీ ప‌డ్డాయి. ఈ పోరులో దక్కన్ ఛార్జర్స్ టోర్నీ విజేతగా నిలిచింది.

ఐపీఎల్ 2010 పైన‌ల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మొద‌టిసారి టైటిల్ ద‌క్కించుకుంది.

ఐపీఎల్ 2011 పైన‌ల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో సారి విజేత‌గా నిలిచింది.

ఐపీఎల్ 2012 పైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చి కోల్‌కతా నైట్‌రైడర్స్ టైటిల్‌ను ఎగ‌రేసుకెళ్లింది.

ఐపీఎల్ 2013 పైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియన్స్ మొద‌టిసారి టైటిల్‌ను గెలుచుకుంది.

ఐపీఎల్ 2014 పైన‌ల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ని చిత్తు చిత్తుగా ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండోసారి విజేత‌గా నిలిచింది.

ఐపీఎల్ 2015 పైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో త‌ల‌ప‌డింది ముంబై ఇండియ‌న్స్‌. ఈ ర‌స‌వ‌త్త‌ర మ్యాచ‌ల్‌లో మ‌ళ్లీ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు క‌ప్ కొట్టేసింది.

ఐపీఎల్ 2016 పైన‌ల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకిచ్చి సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్‌ని గెలుచుకుంది.

ఐపీఎల్ 2017 పైన‌ల్ మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌తో పోరాడిన ముంబై ఇండియ‌న్స్ ముచ్చ‌ట‌గా మూడో సారి విజేత‌గా నిలిచింది.

ఐపీఎల్ 2018 పైన‌ల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి చెన్నై సూపర్ కింగ్స్ మూడో సారి క‌ప్ గెలుచుకుంది.

ఐపీఎల్ 2019 పైన‌ల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు టైటిల్ ద‌క్కించుకుంది.

ఐపీఎల్ 2020 పైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని చిత్తు చిత్తుగా ఓడించి ఏకంగా ఐదోసారి విజేత‌గా నిలిచింది ముంబై ఇండియ‌న్స్‌.

మ‌రి ఐపీఎల్ 2021లో ఫైన‌ల్స్‌కు చేరేది ఎవ‌రు.. టైటిల్ గెలిచేది ఎవ‌రు.. అన్న విష‌యాలు తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.