రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?

April 21, 2021 at 1:03 pm

అప్పటిలో తన అభినయంతో పాటు అందచందాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్స్ లో రంభ ఒకటి. స్టార్‌ హీరోలతో జత కట్టిన ఈ అమ్మడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఎంతో మంది ఫాన్స్ ని సంపాదించుకున్న రంభకు నేనూ ఓ అభిమానినే అంటున్నాడు జగ్గూ భాయ్‌ అలియాస్‌ జగపతిబాబు. అవును ఇది నిజమే.కానీ ఇది రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. గతంలో సినిమాల్లో జగపతిబాబు, రంభ జోడీగా నటించిన సంగతి తెలిసిందే.

ఈ రీల్‌ జోడీ మరోసారి ప్రేక్షకులను మెప్పించనున్నారు. అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ మహా సముద్రం. దీనిలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ ఇటీవలే వైజాగ్‌లో జరిగింది. జగపతిబాబు పై ఓ స్పెషల్ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ సాంగ్‌లో రంభ ఫొటోలు, ఫ్లెక్సీలు కనిపిస్తాయి. ఎందుకంటే, మహా సముద్రం మూవీలో జగపతిబాబు, రంభ అభిమానిగా కనిపించనున్నారు. ఈ పాత చిత్రీకరణ ముందే మూవీ యూనిట్ రంభ పర్మిషన్‌ తీసుకున్నారట.

రంభ ఫ్యాన్ గా జగపతిబాబు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts