మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?

April 16, 2021 at 1:21 pm

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ చిత్రాన్ని సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 31కి మూవీ లాంచ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక పోతే ఈ మూవీకి సంబంధించి క్యాస్టింగ్ సెలక్షన్ కూడా త్రివిక్రమ్ షురూ చేసారని టాక్. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీలో ప్రిన్స్ మహేష్ బాబుకి విలన్గా సౌత్ ఇండియా స్టార్ యాక్టర్ మాధవన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ముందుగా ఈ పాత్ర కోసం ఉపేంద్ర, అరవింద్ స్వామి లాంటి స్టార్స్ ని కలిసారని కానీ వారి డేట్స్ ప్రస్తుతం ఖాళీగా లేకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాధవన్ ని అనుకుంటున్నట్లు సినీ వర్గాల టాక్.

మహేష్ బాబుకి విలన్ గా తమిళ్ హీరో ..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts