ముచ్చ‌ట‌గా మూడోసారి ఆ స్టార్ డైరెక్ట్‌ర్‌కు ఓకే చెప్పిన మ‌హేష్?

April 8, 2021 at 8:00 am

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పూర్తి కాకుండానే మ‌హేష్ మ‌రో స్టార్‌ డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పాడ‌ట‌.

ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో కాదు.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌. ఇటీవల మహేశ్‌కి త్రివిక్రమ్‌ ఓ కథ చెప్పారని.. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాడ‌ట‌. స‌ర్కారు వాటి పాట సినిమా పూర్తి అయిన వెంట‌నే త్రివిక్ర‌మ్ సినిమాను ప‌ట్టాలెక్కించేందుకు మ‌హేష్ భావిస్తున్నాడ‌ట‌.

కాగా, ఇప్ప‌టికే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో ఖ‌లేజా పెద్ద‌గా ఆడక‌పోయినా.. వీరి కాంబోపై సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. ఇలాంటి త‌రుణంలో మ‌హేష్ ముచ్చ‌ట‌గా మూడోసారి త్రివిక్ర‌మ్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని వార్త‌లు రావ‌డంతో.. అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‌

ముచ్చ‌ట‌గా మూడోసారి ఆ స్టార్ డైరెక్ట్‌ర్‌కు ఓకే చెప్పిన మ‌హేష్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts