ప్రముఖ దర్శకురాలు మృతి..!

April 19, 2021 at 1:17 pm

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ మూవీ ఇండస్ట్రీ మార్చేసిన దర్శకురాలు, నిర్మాత అయిన సుమిత్ర భవే చివరి శ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఉదయం ఆమె ప్రాణాలు విడిచారు. సునీల్‌ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త వెలుగు నిచ్చారు.

వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్ర భవే రచయితగా పని చేశారు. ఇంకా సునీల్‌ సుక్తాంకర్‌ నటుడిగా, పాటల రచయితగానూ గుర్తింపు పొందాడు. సుమిత్ర సినిమాల్లో 90 పాటలకు పైగా స్వయంగా సునీల్‌ సుక్తాంకర్ రచించాడు. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గానూ వెలిద్దరికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. 2016లో వారు తీసిన కాసవ్‌ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ లోటస్‌ నేషనల్‌ అవార్డు దక్కింది.

ప్రముఖ దర్శకురాలు మృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts