నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!

April 18, 2021 at 5:03 pm

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒక‌టి. రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్‌ షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైద‌రాబాద్‌లోనే కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు.

పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంద‌ని అంటున్నారు. కాగా, నాని కెరీర్‌లో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts