ధోనీకి షాక్‌.. 12 ల‌క్ష‌ల జ‌రిమానా ఎందుకంటే…!?

April 11, 2021 at 12:39 pm

ఐపీఎల్ 14వ సీజ‌న్ మొదటి మ్యాచ్‌ లోనే ఓటమి పాలయింది చెన్నై సూప‌ర్ కింగ్స్‌. ఇదే కాకుండా ఆ టీమ్ కెప్టెన్ అయిన ధోనీకి ఏకంగా రూ.12 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఎమ్మెస్ ధోనీకి ఈ జ‌రిమానా విధించారు. దీనిని తన మొదటి నేరంగా ప‌రిగ‌ణించి జ‌రిమానాతో వదిలి పెట్టారు. ఈ మ్యాచ్‌లో ధోనీ డ‌కౌటైన సంగతి అందరికి తెలిసిందే. 2015 త‌ర్వాత చెన్నై టీమ్ త‌ర‌ఫున ధోనీ డ‌కౌట‌వ‌డం ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్‌లో చెన్నైకి సానుకూలమయిన అంశం ఏదైనా ఉంది అంటే అది సురేశ్ రైనా ఫామ్‌లోకి రావ‌ట‌మే. గ‌త ఏడాది వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఐపీఎల్‌కు దూర‌మైన రైనా, ఈ సారి మాత్రం అడుగు పెట్టి పెట్టటంతోనే దంచి కొట్టాడు. అందరికి తన పై ఇంకా తన ఫిట్‌నెస్ ‌పై ఉన్న పలు అనుమానాల‌ను దీనితో చెరిపేసాడు.

ధోనీకి షాక్‌.. 12 ల‌క్ష‌ల జ‌రిమానా ఎందుకంటే…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts