పీక కోస్తా అంటూ నాగ‌బాబుకు భార్య వార్నింగ్‌..ఏం జ‌రిగిందంటే?

సినీ న‌టుడు, జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు ఆయ‌న భార్య పీక కోస్తాన‌ని వార్నింగ్ ఇచ్చింద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా నాగ‌బాబునే తెలిపారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, సీరియల్ యాక్టర్‌గా, షోలలో జడ్జ్‌గా ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించిన నాగ‌బాబు.. త‌ర‌చూ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టిస్తూనే ఉంటారు.

అదొక్కటే చేయగలను.. సతీమణి బర్త్ డేపై నాగబాబు ఎమోషనల్ | Nagababu ABout His  Wife Padmaja Birthday - Telugu Filmibeat

ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల నాగ‌బాబు అభిమానుల‌తో లైవ్ చాట్ నిర్వ‌హించ‌గా.. `ఏం సార్.. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?` అని ఓ నెటిజ‌న్ ప్ర‌శ్నించాడు. ఇందుకు నాగ‌బాబు వెంట‌కే ఓకే చెప్పిన సంగ‌తి తెలిసిందే. దీంతో నెట్టింట్లో రెండు రోజుల పాటు నాగ‌బాబు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా మ‌రోసారి నాగ‌బాబు లైవ్ చాట్ నిర్వ‌హించ‌గా.. మళ్లీ రెండో పెళ్లిపైనే టాపిక్ వ‌చ్చింది. ఓ నెటిజ‌న్ `మీరు రెండో పెళ్లి ఎందుకు చేసుకోలేదు సార్` అని అడగ్గా.. నాగ‌బాబు `మా ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు.. ఆ ఆలోచన వచ్చినా పీక కోస్తా అని ప్రేమగా చెప్పింది.. అంత ప్రేమగా చెప్పాక నేను మాత్రం రెండో పెళ్లి గురించి ఎందుకు ఆలోచిస్తాను` స‌ర‌దాగా కామెంట్ పెట్టారు.