మెగా బ్రదర్ నాగబాబు వాట్సప్ డీపీ అదేనట..!

April 13, 2021 at 3:12 pm

మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ తన ఫాలోయర్స్ తో సరదాగా ఆడే పరాచకాల గురించి కూడా అందరికీ తెలిసిందే. తన పై వచ్చే ట్రోలింగ్స్‌కు నాగబాబు ఇచ్చే కౌంటర్లు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో నాగబాబు కాంట్రవర్సీకి కింగ్ అంటూ ఉంటారు అంతా. అలాంటి నాగబాబు ఈ మధ్య తన ఫాలోవర్లతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా, సెటైరికల్‌గా స్పందిస్తూ జవాబులు ఇస్తున్నారు.

 

అలాంటి నాగబాబు తాజాగా మరోసారి తన ఫాలోవర్లతో చిట్ చాట్ చేసాడు. ఆ సందర్భంలో ఓ నెటిజన్ ఒక సీక్రెట్ చెప్పమని అడిగాడు. వాట్సప్ డీపీ ఏంటి అంటూ ఓ ఫాలోవర్ అడగగా, దానికి నాగబాబు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చాడు. ఓ ఫోటోను షేర్ చేసి అదే తన వాట్సప్ డీపీ అని చెప్పారు. అందులో వివాదాస్పద దర్శకుడు వర్మ ఇంకా బాలయ్య ఇద్దరూ కూడా ముచ్చట్లు పెడుతున్న ఫోటో అది. ఇది చూసి ఏది ఏమైనా నాగబాబు కి కాంటర్ ఎలా ఇవ్వాలో సరిగ్గా తెలుసు అంటున్నారు నెటిజన్స్ అంతా.

మెగా బ్రదర్ నాగబాబు వాట్సప్ డీపీ అదేనట..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts