`శ్రీరామనవమి`కి మంచి ట్రీట్ ఇచ్చిన నాగ‌శౌర్య‌!

April 21, 2021 at 1:55 pm

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య, ‌రీతు వర్మ జంటగా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ఈ రోజు శ్రీ‌రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా.. నాగ‌శౌర్య అభిమానుల‌కు వ‌రుడు కావ‌లెను మేక‌ర్స్‌ మంచి ట్రీట్ ఇచ్చారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాగశౌర్య అలా గోడపై కూర్చున్నట్లు క‌నిపిస్తుండ‌గా.. బాక్గ్రౌండ్ లో ఉన్న వాల్‌పై శ్రీరాముడు, సీతాదేవిల కళ్యాణం జరుగుతుండ‌టాన్ని హైలైట్ చేశారు. మొత్తాని ఈ పోస్ట‌ర్ తెగ ఆక‌ట్టుకుంటోంది.

Image

`శ్రీరామనవమి`కి మంచి ట్రీట్ ఇచ్చిన నాగ‌శౌర్య‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts