జూన్ నుంచి బంగారం ఆభరణాలపై అది తప్పనిసరి…!

జూన్ 1వ తేదీ నుంచి పసిడి ఆభ‌ర‌ణాల‌ పై హాల్‌ మార్క్ ముద్ర త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. బంగారంలో క‌ల్తీని నివారించ‌డంతో పాటు బంగారం ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ‌లు ఫిట్ నెస్ ప్ర‌మాణాల‌ను పాటించ‌డానికి వీలుగా కేంద్రం ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఈ నిర్ణయమ తీసుకుంది. కేంద్రం మొదటిసారి 2019 న‌వంబ‌ర్ ‌లో బంగారం ఆభ‌ర‌ణాల ‌పై హాల్‌ మార్కింగ్ చేయాల‌ని ప్ర‌క‌టించింది.

 

ఈ ఏడాది జ‌న‌వ‌రి 15వ తేదీ నుంచి బంగారం ఆభ‌ర‌ణాల‌పై హాల్ మార్కింగ్ నిబంధ‌నను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల్సిందేన‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈ కొత్త రూల్స్ అమలులోకి వస్తే, జువెలర్స్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అంతేతప్ప ఇంకా తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని అమ్మడానికి అవ్వదు. అలాగే బీఐఎస్ మార్క్ కూడా తప్పనిసరి. ఇక పై జువెలరీ సంస్థలు ఈ కొత్త నిబంధనలు పాటించకపోతే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా కూడా పడుతుంది.