ఇస్మార్ట్ పోరితో నితిన్ రొమాంటిక్ రైడ్‌..అదిరిన ఫొటో!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. హిందీలో సూప‌ర్ హిట్ అయిన `అంధాదున్` చిత్రానికి రీమేక్ ఇది. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ పోరి న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది.

నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు శ్రీరామనవమి సంద‌ర్భంగా.. మాస్ట్రో చిత్రం నుంచి ఓ కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ పోస్ట‌ర్‌లో అంధుడు అయిన హీరో నితిన్ బ్లాక్ కళ్లద్దాలు హెల్మెట్ పెట్టుకొని హీరోయిన్ నభానటేష్ వెనక స్కూటీ పై కూర్చున్నాడు. చూస్తుంటే హీరో హీరోయిన్ ఇద్దరూ కూడా రొమాంటిక్ రైడ్ కు వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. చాలా క‌ల‌ర్ ఫుల్‌గా ఉన్న ఈ పోస్ట‌ర్ అదిరిపోవ‌డంతో పాటు ఆక‌ట్టుకుంటోంది. ‌