`రంగ్ దే` క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్‌కు షాక్ త‌ప్ప‌లేదుగా!

April 12, 2021 at 11:22 am

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన చిత్రం రంగ్ దే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. మార్చి 26న విడుద‌లైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.

కానీ, క‌లెక్ష‌న్స్ విష‌యంలో మాత్రం నితిన్‌తో పాటు చిత్ర యూనిట్‌కు షాక్ త‌గిలింది. మొద‌టి నాలుగు రోజులు మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం.. ఆ త‌ర్వాత పూర్తిగా డ‌ల్ అయిపోయింది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కలెక్షన్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఈ లెక్క‌ల ప్ర‌కారం.. తెలుగు రాష్ట్రాల‌తో స‌హా వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 16.51 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్టింది. వాస్త‌వానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 24 కోట్లు వసూలు చేయాలి. కానీ రంగ్ దే ఆ టార్గెట్‌ను రీచ్ కాలేక‌పోయింది. ఇక రంగ్ దే క్లోజింగ్ కలెక్షన్స్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

నైజాం- 5.80 కోట్లు
ఉత్తరాంధ్ర- 1.78 కోట్లు
సీడెడ్- 2.15 కోట్లు
ఈస్ట్- 1.08 లక్షలు
వెస్ట్- 66 లక్షలు
గుంటూరు- 1.20 కోట్లు
కృష్ణా- 74 లక్షలు
నెల్లూరు- 52 లక్షలు
———————————–
ఏపీ+తెలంగాణ ఫైనల్ కలెక్షన్స్- 13.91 కోట్లు
———————————–

కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 78 లక్షలు
ఓవర్సీస్- 1.83 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్- 16.51 కోట్లు

`రంగ్ దే` క్లోజింగ్ కలెక్షన్స్..నితిన్‌కు షాక్ త‌ప్ప‌లేదుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts