మ‌రింత ఆల‌స్యం కానున్న ఎన్టీఆర్ షో..నిరాశ‌లో అభిమానులు?

April 8, 2021 at 8:15 am

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై సైతం ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే.

జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదో సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ షోపై భారీ అంచ‌నాలు నొల‌కొన్నాయి. ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని బుల్లితెర ప్రేక్ష‌కులు, అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈ షో ప్ర‌సారం మ‌రింత ఆల‌స్యం కానుంద‌ని తెలుస్తోంది. ప‌లు కార‌ణాల వ‌ల్ల ఈ షోను జూలై నుంచి స్టార్ట్ చేయ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కార‌ణంగా ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర నిరాశ‌కు గురైన‌ట్టు తెలుస్తోంది.

మ‌రింత ఆల‌స్యం కానున్న ఎన్టీఆర్ షో..నిరాశ‌లో అభిమానులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts