పవన్ కరోనా టెస్ట్ రిజల్ట్ ఇదే..!

మళ్ళీ దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తుంది. అటు సినీ వర్గాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెండియాన్ బృందం సభ్యులలో కరోనా పోస్టివ్ రావటంతో అందరిలో కాస్త ఆందోళన మొదలయ్యింది. దానితో పవన్ వెంటనే స్వీయ ఐసోలేషన్ లోకి వెళ్లారు.

దానితో పాటుగా పవన్ కరోనా టెస్ట్లు చెయ్యించుకోగా, ఇప్పుడు దాని రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. నిన్న హైదరాబాద్ ట్రినిటీ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ చేయించుకున్న పవన్ కు నెగిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీనితో పవన్ అభిమానులు కుదుట పడ్డారు. ఇక పవన్ ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీ అయ్యప్పన్ కోషియం రీమేక్ లో అలాగే క్రిష్ తో భారీ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నారు.