విశ్వమిత్రుడి గెటప్‌లో ప్ర‌భాస్‌..నెట్టింట్లో రేర్ ఫొటో వైర‌ల్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధే శ్యామ్‌` పూర్తి చేసిన ప్ర‌భాస్‌.. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌` చిత్రాల‌ను సెట్స్ మీద‌కు తీసుకువెళ్లాడు.

ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక ఇవి పూర్తి అయిన వెంట‌నే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్ర‌భాస్‌కు సంబంధించిన ఓ రేర్ ఫొటో ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

Prabhas

ఈ ఫొటోలో ప్ర‌భాస్ విశ్వ‌మిత్రుడి గెట‌ప్‌లో చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నారు. గతంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాను విశ్వమిత్ర క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ బ్యానర్ లోగో కోసం విశ్వమిత్రుడి గెటప్ అవసరమైంది. ఆ గెటప్ కు ప్రభాస్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని భావించిన జక్కన్న ప్రభాస్ ను విశ్వమిత్రుడిగా మార్చాడు. ఆ ఫొటోనే ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.