రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న కలర్స్ స్వాతి..!?

April 22, 2021 at 2:02 pm

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర నుంచి వెండితెర పైకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించిన అతి కొద్దిమంది అమ్మాయిల్లో కలర్స్ స్వాతి ఒకరు. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అయింది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది. పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి.

కొత్త దర్శకుడు హర్ష పులిపాక ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ హీరో అడవి శేష్ రిలీజ్ చేసాడు. తాజాగా విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అన్ని ఎమోషన్స్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ హర్ష ఈ కథను రెడీ చేశాడు. స్వాతి రెడ్డి దాదాపు ఆరేళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం ఇది. కలర్ ఫోటో సినిమాని తెరకెక్కించిన సందీప్ రాజ్ ఈ సినిమాకు మాటలు రాస్తుండటం మరో విశేషం. మరి పంచతంత్రం మూవీతో స్వాతి రెడ్డికి మంచి విజయం పొందాలని ఆశిద్దాం.

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న కలర్స్ స్వాతి..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts