సెన్సేషనల్ రికార్డ్‌ క్రియేట్ చేసిన `పుష్ప` రాజ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్‌ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌.. లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు.

ఇక ఇటీవ‌ల బ‌న్నీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఈ టీజ‌ర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టీజర్‌గా సెన్సేషనల్ రికార్డును సెట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. జస్ట్ 59 గంటల 10 నిమిషాల్లో ఈ ఫిట్‌ను పుష్ప రాజ్ అందుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఇక మ‌రోవైపు సౌత్ లోనే ఇంతవరకు 24గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న టీజర్ లలో పుష్ప సెకండ్ ప్లేస్ లో నిలిచింది. కేజీఎఫ్ చాప్టర్-2 68.83 మిలియన్ల వ్యూవ్స్ తో మొదటి స్థానంలో నిలివ‌గా.. పుష్ప 22.52 మిలియన్ల వ్యూవ్స్ తో రెండో ప్లేస్ ద‌క్కించుకుంది. ఇక మూడవ స్థానంలో విజయ్ మాస్టర్ టీజర్ నిలిచింది.