కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ ఫైర్…!?

దేశ భద్రతను మోదీ ప్రభుత్వం ప్రమాదంలో పడేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చైనాతో వారు జరిపే చర్చలు శుద్ధ దండగ అని ఆయన వ్యాఖ్యానించారు. గోగ్రా, డెస్పాంగ్ ప్రాంతాల్లో చైనా ఆక్రమణలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు పెను సవాల్ గా మారాయని రాహుల్ అన్నారు. డ్రాగన్ తో జరిపే చర్చలతో దేశ భద్రత ఆందోళనకరంగా మారిందని సోమవారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు.

తూర్పు లడఖ్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, డెస్సాంగ్ ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు చైనా చూపించే వైఖరి వస్తున్న వార్తల నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వైపు తూర్పు లడఖ్ లో సేనల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఇప్పుడు ఎందుకు నిరాకరిస్తోందని కాంగ్రెస్ నేతలు మోదీ సర్కార్ ను ప్రశ్నించారు. సేనల ఉపసంహరణ పై డ్రాగన్ తో జరిపిన చర్చలు ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదని మోడీ ప్రభుత్వాని నిలదీశారు. ఈ అంశం పై ప్రభుత్వం విస్పష్ట సమాచారంతో ముందుకురావాలని కాంగ్రెస్ ప్రతినిధి అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.