ఐపీఎల్ 2021:రాజస్థాన్‌కి బిగ్‌ షాక్..ఆ కీల‌క ఆట‌గాడు ఔట్‌!

April 14, 2021 at 7:56 am

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. జ‌ట్టులో కీల‌క ఆడ‌గాడు, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఈ సీజ‌న్ మొత్తానికి దూర‌మ‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఐపీఎల్ 2021లో భాగంగా సోమ‌వారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

చివ‌రి వ‌ర‌కు ఎంతో ఉత్కంఠ‌భ‌రింత‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజ‌యం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో యువ పేసర్ రియాన్ పరాగ్ విసిరిన బంతిని లాంగాన్ దిశగా క్రిస్‌గేల్ హిట్ చేయగా.. బౌండరీ లైన్‌కి సమీపం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన బెన్‌స్టోక్స్ డైవ్ చేస్తూ మరీ క్యాచ్‌ని అందుకున్నాడు.

ఈ క్రమంలో అతని కుడిచేతి వేలికి తీవ్ర‌ గాయమైంది. అయిన‌ప్ప‌టికీ ఆట‌ను కొన‌సాగించాడు. బౌలింగ్, బ్యాటింగ్ కూడా చేశాడు. అయితే మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ‌వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతని చేతి వేలు విరిగింద‌ని సర్జరీ చేయాల‌ని తెలిపారు. దీంతో ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికీ బెన్‌స్టోక్స్ దూర‌మైన‌ట్టు ప్ర‌క‌టించారు. ఏదేమైనా ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ జ‌ట్టు నుంచి ఔట్ అవ్వ‌డం రాజస్థాన్‌కి ఊహించ‌ని షాక‌నే చెప్పాలి.

ఐపీఎల్ 2021:రాజస్థాన్‌కి బిగ్‌ షాక్..ఆ కీల‌క ఆట‌గాడు ఔట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts