బ్లాక్ సారీలో మ‌తిపోగొడుతున్న ర‌ష్మి..ఫొటోలు వైర‌ల్‌!

April 12, 2021 at 1:58 pm

ర‌ష్మి గౌత‌మ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది రష్మి. కానీ, ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ తెచ్చుకుంది.

జబర్దస్త్ వేదికపై ఉదయించిన ఈ సౌందర్య రాణి, తిరుగులేకుండా దూసుకుపోతున్నారు. జబర్దస్త్ అనే కామెడీ షోకి గ్లామర్ మెరుగులు అద్దిన ఘనత రష్మీదే అని చెప్పాలి. ఒక విధంగా తెలుగు బుల్లితెరకు గ్లామర్ పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు.

ఇక ఈ షోలో యాంక‌ర్‌గా కొన‌సాగుతూనే అడ‌పాత‌డ‌పా సినిమాల్లోనూ కూడా న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉండే ర‌ష్మి.. ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది.

అందుకే టాప్ యాంకర్స్ లో ఒకరిగా బుల్లితెరను ఏలేస్తుంది రష్మీ. తోటి యాంకర్స్ అందం విషయంలో ఆమెకు పోటీ ఇవ్వాలని చూస్తున్నా.. వాళ్ళ వల్ల కావడం లేదు. యాంకర్స్ లో అనసూయ మాత్రమే రష్మీ గ్లామర్ తో పోటీపడగలదు.

ఈ క్ర‌మంలోనే తాజాగా కొన్ని ఫొటోల‌ను షేర్ చేసింది. బ్లాక్ సారీలో వ‌య్యారాలు వ‌ల‌క‌బోస్తూ సూప‌ర్ హాట్‌గా ఈ ఫొట్లోల్లో ర‌ష్మి క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ కావ‌డంతో.. నెటిజ‌న్లు లైక్లు, కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.‌

రష్మీ బుల్లితెర ఎంట్రీ ఇచ్చి దాదాపు ఏడేళ్లు దాటిపోయింది. అయినా ఆమె క్రేజ్ ఇంచు కూడా తగ్గలేదు. బుల్లితెర ప్రేక్షకులతో పాటు,  యూత్ లో సూపర్ ఫాలోయింగ్ కలిగి ఉంది రష్మీ.

రష్మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని మిలియన్స్ లో ఫాలో అవుతున్నారంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ ఆమె సొంతం.

నటిగా కూడా రష్మీ వెండితెరపై సెగలు రేపారు. ఆమె నటించిన సినిమాల ఫలితం ఎలా ఉన్నా, ఆమెకు మాత్రం సెక్సీ లేడీ అంటూ మంచి మార్కులే పడ్డాయి. సరైన బ్రేక్ వస్తే, రష్మీ వెండితెరపై కూడా దూసుకుపోవడం ఖాయం.

బ్లాక్ సారీలో మ‌తిపోగొడుతున్న ర‌ష్మి..ఫొటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts