సుకుమార్ తీరుపై ర‌ష్మిక ఫ్యాన్స్ ఆగ్ర‌హం..కార‌ణం అదేన‌ట‌?

April 7, 2021 at 8:42 am

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్‌పై ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసేంత విష‌యం ఏం జ‌రిగి ఉంటుంది అనే సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్‌, ర‌ష్మిక హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`.

అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా.. పుష్పరాజ్ పాత్రను ఏప్రిల్ 7న సాయంత్రం విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇందుకోసం జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఓ ఈవెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో బ‌న్నీ అభిమానుల్లో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది.

అయితే బ‌న్నీ బ‌ర్త్‌డేకి మంచి ట్రీట్ ఇస్తున్న సుకుమార్‌.. మూడు రోజుల ముందు పుట్టినరోజు జరుపుకున్న రష్మిక మందనను పూర్తిగా మరిచిపోయారు. క‌నీసం ఈ చిత్రం నుంచి ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్‌ను కూడా విడుద‌ల చేయ‌లేదు. అందుకే ర‌ష్మికకు స‌రైన ప్రాముక్య‌‌త ఇవ్వ‌డం లేదంటూ సుకుమార్‌పై ఆమె ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.‌

సుకుమార్ తీరుపై ర‌ష్మిక ఫ్యాన్స్ ఆగ్ర‌హం..కార‌ణం అదేన‌ట‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts