ర‌ష్మిక‌కు అనుకోని దెబ్బ‌‌..తీవ్ర నిరాశ‌లో ల‌క్కీ బ్యూటీ?

April 12, 2021 at 8:54 am

ర‌ష్మిక మంద‌న్నా.. ప‌రిచ‌యాలు అవస‌రం లేని పేరు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మ‌రోవైపు క‌న్న‌డ‌లోనూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈ ల‌క్కీ బ్యూటీ మారిపోయింది. ఇక త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ర‌ష్మిక‌కు.. తమిళంలో మాత్రం అనుకోని దెబ్బ త‌గిలింది.

ఇటీవ‌ల కార్తి హీరోగా తెర‌కెక్కిన `సుల్తాన్‌` సినిమాతో త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది ర‌ష్మిక‌. భాగ్యరాజా ఖన్నన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించింది. భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

ఫ‌లితంగా, ర‌ష్మిక క‌ల‌ల‌పై నీళ్లు జ‌ల్లిన‌ట్టు అయింది. వాస్త‌వానికి తెలుగులో ఈ బ్యూటీ న‌టించిన‌న తొలి సినిమా ఛలో సూపర్ హిట్ కాగా.. కన్నడలో కిరిక్ పార్టీ కూడా మంచి హిట్ అయింది. అయితే తమిళంలోనూ సుల్తాన్‌ చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాల‌ని భావించిన ర‌ష్మిక‌కు ఎదురు దెబ్బ త‌గిలింది. అందుకే ఆమె తీవ్ర నిరాశ‌కు గురైన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ర‌ష్మిక‌కు అనుకోని దెబ్బ‌‌..తీవ్ర నిరాశ‌లో ల‌క్కీ బ్యూటీ?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts