గుండు లుక్‌లో‌ రష్మిక..షాక‌వుతున్న అభిమానులు!

April 21, 2021 at 1:14 pm

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాదు.. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్ ఇలా అన్ని భాష‌ల్లోనూ ఆఫ‌ర్లు రాబ‌డుతూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

ఇదిలా ఉంటే.. గుండు లుక్ లో ఉన్న ర‌ష్మిక ఫొటో ఒక‌టి ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు ఒక్క‌సారిగా‌ షాకవుతున్నారు.

అసలు నిజంగానే రష్మిక గుండు కొట్టించుకుందా అని ఆమె ఫాలోవర్స్‌ నెట్టింట సెర్చ్‌ చేయగా.. తమిళనాడులోని కొన్ని సెలూన్ షాపుల వారు తమ వ్యాపారం కోసం రష్మిక ఫోటోను ఇలా వాడేశారని తెలిసింది. దీంతో రష్మిక గుండు ఫోటోలతో ఫన్నీ మీమ్స్‌ సృష్టిస్తూ మీమర్స్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నారు. మొత్తానికి ర‌ష్మిక గుండె ఫొటోలు మాత్రం తెగ వైర‌ల్ అవుతున్నాయి.

గుండు లుక్‌లో‌ రష్మిక..షాక‌వుతున్న అభిమానులు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts