అర‌రే..ఆ విష‌యంలో ర‌ష్మిక‌ని తల్లిదండ్రులే నమ్మలేద‌ట‌!

April 15, 2021 at 9:30 am
Rashmika who will act with Akkineni hero

ర‌ష్మిక మంద‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ త‌క్కువ స‌మ‌యంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప‌`, శ‌ర్వానంద్ స‌ర‌స‌న `ఆడాళ్ళూ మీకు జోహార్లు` చిత్రాల్లో న‌టిస్తోంది.

అలాగే `మిషన్ మజ్ను` మూవీ తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ర‌ష్మిక‌.. ఈ సినిమా పూర్తి కాక‌ముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో నటిస్తున్న `గుడ్ బాయ్` సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. వికాస్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తుండ‌గా.. ఆయ‌న కూతిరి పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌నుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకుంది ర‌ష్మిక‌.

అమితాబ్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింద‌ని చెబితే.. ర‌ష్మిక‌ను తన తల్లిదండ్రులు అస్స‌ల‌ నమ్మలేద‌ట‌. ఆ త‌ర్వాత నిజం తెలుసుకున్న ఆమె త‌ల్లిదండ్రులు ఎంతో సంతోషించార‌ట‌. అంతేకాదు, రష్మిక అమ్మా, నాన్న.. బిగి బికి బిగ్ ఫ్యాన్స్ అట. ఆయన సినిమాలన్నీ తప్పకుండా చూస్తుంటారట. అలాంటి లెజెండరీ నటుడితో తమ కూతురు క‌లిసి న‌టించ‌బోతుంద‌ని హ్యాపీగా ఫీల్ అయ్యార‌ట‌.

అర‌రే..ఆ విష‌యంలో ర‌ష్మిక‌ని తల్లిదండ్రులే నమ్మలేద‌ట‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts