రాధే విడుదల ఇప్ప‌ట్లో లేన‌ట్లే అన్న సల్లూ భాయ్..!

April 8, 2021 at 1:01 pm

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ న‌టిస్తున్న రాధే చిత్రం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఈ రంజాన్‌కే సినిమా విడుదల అవుతోంద‌ని ఆశ పడ్డారు కానీ స‌ల్లూ భాయ్ మాత్రం వాళ్ల‌కు బ్యాడ్ న్యూస్ చెప్పాడు. కొవిడ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో రాధేను వ‌చ్చే సంవత్సరం రంజాన్‌కే విడుదల చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సల్మాన్ చెప్పాడు.

ఈ మ‌ధ్య జ‌రిగిన ఓ బుక్ లాంచ్‌లో రాధే మూవీ విడుదల ‌పై స‌ల్లూ భాయ్ నోరు విప్పాడు. ఈ మూవీని ఈద్‌కు రిలీజ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాం. కానీ లాక్‌డౌన్ ఇలాగే కొన‌సాగితే మాత్రం విడుదల ను వ‌చ్చే ఈద్‌కు వాయిదా చేయవచ్చు. కానీ ప్ర‌జ‌లు అన్ని జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌కుండా పాటిస్తూ, మాస్కులు త‌ప్ప‌కుండా పెట్టుకోవాలి. ఇంకా భౌతిక దూరం పాటించాలి అని స‌ల్మాన్ అన్నారు. అలా చేస్తే కొవిడ్ రెండో ద‌శ అతి త్వ‌ర‌లోనే సమాప్తం అవుతుందని త‌న సినిమా విడుదల అవుతుంద‌ని అన్నాడు.

రాధే విడుదల ఇప్ప‌ట్లో లేన‌ట్లే అన్న సల్లూ భాయ్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts