`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!

April 13, 2021 at 2:59 pm

సంచలన దర్శకుడుగా పేరు ఉన్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరలా ఒక వివాదాస్ప ద చిత్రాన్ని తీస్తున్నారనే వార్త హల్చల్ చేస్తుంది. అది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ కేంద్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి జగమొండి అనే పేరును ఖరారు చేసారని తెలుస్తోంది. దీనికి నిర్మాతగా, కడప జిల్లాకే చెందిన ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో చైర్మన్ అయిన ఓ నాయకుడి కుమారుడు అని తెలుస్తోంది.

 

ఆర్జీవీతో ఇప్పటికే డి-కంపెనీ అనే చిత్రాన్ని తీస్తున్నాడట. మళ్లీ ఆయనే ఇప్పుడు ఆర్జీవీతో మరో సినిమాకి సిద్ధం అయ్యారని అంటున్నారు. ఈ సినిమాలో జగన్ ఎంత మొండి వాడో చూపించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తన పదవి కోసం, కాంగ్రెస్ పార్టీతో విభేదించడం బయటకు రావడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు అనే అంశాలను ఆర్జీవీ చూపించనున్నారట. ఈ క్రమంలో జగన్ జైలు జీవితాన్ని కూడా చూపిస్తారని టాక్.

`జగమొండి` అంటున్న ఆర్జీవీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts