ఆర్‌ఆర్‌ఆర్ అసలు కథ ఏంటి ..?

rrr

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి బాహుబలి చిత్రం తర్వాత తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. టాలీవుడ్ ప్రముఖ స్టార్‌ హీరోలు యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం. తాజాగా ట్రిపులార్‌ కథకు సంబంధించిన వార్త ఒక్కటి హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే, రాజమౌళి ఆర్ఆర్‌ఆర్ చిత్రాన్ని పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడట. అల్లూరి సీతారామరాజు 1897 పుట్టి 1924లో చనిపోతాడు. అలాగే కొమురం భీమ్‌ 1901లో పుట్టి 1940లో చనిపోతాడు. ఈ ఇద్దరు స్వాతంత్ర సమర యోధులు మళ్లీ 1940 ప్రాంతంలో జన్మించి బ్రిటీష్‌ వారి పై పోరాటం చేస్తారు. ఆ కథనే దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌‌ చిత్రంలో ఫస్టాఫ్‌ అంతా ఎక్కవగా ఎన్టీఆర్‌ మీదనే రన్‌ అవుతుంది. పునర్జన్మలో భాగంగా పుట్టిన ఎన్టీఆర్‌ పాత్ర దొంగ. ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే రామ్‌చరణ్‌ మీద ఎక్కువగా రన్‌ అయ్యేలా రాజమౌళి ఈ కథని మలిచాడని టాక్‌ వినిపిస్తోంది. పునర్జన్మ తర్వాత రామ్‌చరణ్‌, పోలీస్ అధికారిగా కనిపిస్తాడు. ఓ దొంగ పోలీస్‌ మధ్య ఈ చిత్రం ఉండనుంది. మరి ఈ కథలో ఎంత వరుకు నిజం ఉందొ తెలియాలంటే రిలీజ్ వరుకు ఎదుటరు చూడాల్సిందే.