సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!

April 15, 2021 at 1:16 pm

టాలీవుడ్లో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సెహరి. విర్గో పిక్చర్స్ బ్యానర్ ‌పై రూపొందుతున్న ఈ సినిమాకి అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

 

ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమఠం, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను ఏప్రిల్ 16న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నటసింహం నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేశారు. దీంతో సినిమా పై చాల హైప్ క్రియేట్ అవుతుంది.

సెహరి’ టీజర్ తేదీ ఖరారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts