ప్రముఖ గాయకుడు మృతి..!

April 26, 2021 at 12:13 pm

ప్రముఖ హిందుస్థానీ గాయకుడు అయిన రాజన్‌ మిశ్రా కరోనా కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడిన రాజన్‌ మిశ్రా గత మూడు రోజులుగా సెయింట్‌ స్టీఫెన్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి బాగా విషమించడంతో వెంటిలేటర్‌ బెడ్ కోసం చూసినా పెద్దగా ఫలితం లేక పోయింది. దీంతో ఆయన శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్‌ మీడియా ద్వారా సహాయం కోరారు.

చివరకు ప్రధాని కార్యాలయం దీని పైవెన్తనె స్పందించి వెంటిలేటర్‌ సదుపాయాన్ని కల్పిస్తామని కుటుంబ సభ్యులను సంప్రదించారు. కానీ అప్పటికే గాయకుడు రాజన్‌ మిశ్రా గుండెపోటుతో ప్రాణాలు విడిచారని ఆయన కుమారుడు రజనీష్‌ తెలియ చేశారు. రాజన్‌ తన సోదరుడు సజన్‌ మిశ్రాతో కలిసి రాజన్‌ ఖయాల్‌ గాయకీ శైలికి విశేష ప్రాచుర్యం కల్పించారు. రాజన్‌ మిశ్రా 70 ఏళ్ల వయసుతో కరోనా బారిన పడి ఆదివారం సాయంత్రం కన్ను మూశారు.

ప్రముఖ గాయకుడు మృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts