బ్రేకింగ్ : సోనూసూద్ కి కరోనా పాజిటివ్…!

April 17, 2021 at 2:05 pm

బాలీవుడ్ నటుడు రియల్ హీరో అయిన సోనూసూద్ కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ సంగతి ఆయనే స్వయంగా ప్రకటించారు. ఈరోజు ఉదయం కోవిడ్-19 పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని, తాను ఆల్రెడీ హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని, కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను అని సోషల్ మీడియా ద్వారా చెప్పారు సోనూసూద్. ఇంకా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

మీకోసం నేను ఉన్నాను అంటూ తనకు కరోనా వచ్చిందన్న విషయాన్ని వెల్లడించారు సోనూసూద్. ఇటీవల పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఆ టైములో పంజాబ్ ముఖ్యమంత్రిని కూడా కలిసాడు సోనూ. కరోనా కష్ట కాలంలో వలస కార్మికులకు ఆయన చేసిన సహాయం పై దేశవ్యాప్తంగా అందరి ప్రశంసలు ఆయన పొందారు. ఇప్పటికీ కూడా సోనూసూద్ కష్టం అని అడిగినవారికి లేదనకుండా తన వంతు సహాయం అందిస్తున్నారు.

 

 

 

<blockquote class=”twitter-tweet”><p lang=”und” dir=”ltr”>🙏 <a href=”https://t.co/2kHlByCCqh”>pic.twitter.com/2kHlByCCqh</a></p>&mdash; sonu sood (@SonuSood) <a href=”https://twitter.com/SonuSood/status/1383327019220439042?ref_src=twsrc%5Etfw”>April 17, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

బ్రేకింగ్ : సోనూసూద్ కి కరోనా పాజిటివ్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts