వారికీ ఉచిత విద్య ఇవ్వండి : సోను సూద్

April 30, 2021 at 1:48 pm

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందించాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ కోరారు. కొవిడ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి సాయం చేసిన ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. దేశంలో రోజు రాజీకి కరోనా కేసులు విజృంభిస్తోన్న తిరుమల్లో దాని వల్ల వారి పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారతోందని సోనూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎనిమిది నుంచి 12 సంవత్సరాలు వయస్సున్న ఎంతోమంది చిన్నారులు కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోతున్నారు. అలాంటి పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తోంది. కాబట్టి వాళ్ళకు అండగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు సంబంధిత ఎన్జీవోలను కోరుతున్నాను. అలాగే, ప్రాథమిక స్కూల్‌ నుంచి కళాశాల వరకూ వాళ్లకు ఉచిత విద్య అందించాలని అభ్యర్థిస్తున్నాను అంటూ సోనూ సూద్ విజ్ఞప్తి చేశారు.

వారికీ ఉచిత విద్య ఇవ్వండి : సోను సూద్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts