సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్…!

April 16, 2021 at 12:33 pm

లాక్‌డౌన్ స‌మ‌యంలో అడిగిన వారికీ లేద‌న్న‌ట్టు అందరికి సాయం చేసుకుంటూ వచ్చాడు రియ‌ల్ హీరో సోనూసూద్. ఎవరైనా సాయం అడ‌గాలే కాని లేదు అనకుండా హెల్ప్ చేసాడు సోనూ. సినిమాల‌లో ప్రతినాయకుడిగా చేసినప్పటికీ, రియ‌ల్ లైఫ్‌లో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా కూడా సోనూసూద్‌కు చాలా రిక్వెస్ట్‌లు వ‌స్తుంటాయి. వాట‌న్నింటిని ఓపికగా బ‌దులిస్తూ సాయం చేసుకుంటూ వెళ్తున్నారు.

సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్ చేరాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సోనూసూద్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 6 మిలియ‌న్స్‌కు చేరింది. 60 ల‌క్ష‌ల మంది అభిమానాన్ని పొందిన సోనూసూద్‌కు నెటిజ‌న్స్ శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు..ఇదిలా ఉంటే రీసెంట్‌గా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తన వంతుగా 10 ఆక్సిజన్ సిలిండర్ల దానం చేసి హెల్ప్ చేశారు. ప్ర‌స్తుతం సోనూసూద్, మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఆచార్య సినిమాలో న‌టిస్తున్నారు.

సోషల్ మీడియాలో 6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts