వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?

April 17, 2021 at 1:48 pm

ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ట్రెడిషనల్ లుక్ నుండి మోడ్రన్ దుస్తులకు మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో మన టాలీవుడ్ అందాల భామ మహానటి కీర్తి సురేష్ కూడా ఉంది. ప్రస్తుతం ఈమె వరుస సినిమాలు చేస్తూ, చేతిలో ఫుల్ మూవీ ఆఫర్లతో ముందుకు దూసుకుపోతుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాదించుకుంది కీర్తి.

ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ భామ, ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారయింది. ప్రస్తుతం నటించిన చిత్రాల్లో ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేష్ అక్కడ దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో చేతి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని, మోడ్రన్ లుక్ తో అందరిని బాగా ఆకట్టుకుంటుంది కీర్తి . కీర్తి సురేష్ ఫోటో చూశాక మొత్తానికి స్టైలిస్ట్ ట్రెండ్ బాగానే ఫాలో అవుతుందని తెలుస్తుంది.

వైరల్ : మోడ్రన్ లుక్‌కి చేంజ్ అయిన కీర్తి..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts