వెండిత‌ర ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌బోతున్న మెగా డాటర్..!

మెగా ఫ్యామిలీ నుండి అనేక మంది నటి నటులు ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మ‌రొక‌రు వెండిత‌ర ప్ర‌యాణం మొద‌లు పెట్ట‌నున్నారు. ఆమె ఎవరంటే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత‌. ఇప్పటికే క్యాస్టూమ్ డిజైనర్ గా చిరు, చరణ్ సినిమాలకు పని చేశారు సుస్మిత‌. ఈ మ‌ధ్య తన‌ భర్త విష్ణుతో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ స్థాపించిన సుస్మిత షూటౌట్ ఎట్ ఆలేరు పేరుతో వెబ్ సిరీస్ కూడా నిర్మించారు.

ఇటీవలే 8 తొట్ట‌క‌ల్ అనే త‌మిళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన సుస్మిత ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌ని ఆలోచనలో ఉన్నారు. ఈ మూవీ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ కాగా, దీనిని తెలుగులో ఓ యువ హీరోతో చేయ‌నున్నారట సుస్మిత‌. కేసు విచార‌ణ‌లో పోలీసు త‌న రివాల్వ‌ర్ పోగొట్టుకోగా ఇది ఎన్నో చర్యలకు దారి తీస్తుంది. నాలుగేళ్ల క్రితం త‌మిళంలో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద హిట్ సాధించింది. క‌న్న‌డ‌లోను రీమేక్ కాగా, అక్క‌డ కూడా పెద్ద హిట్ కొట్టింది.