ఒకే అమ్మాయిని 4 సార్లు పెళ్లాడిన వ్య‌క్తి..ఎందుకో తెలిస్తే మైండ్‌బ్లాకే!

April 15, 2021 at 10:36 am

పెళ్లి చేసుకోవ‌డం.. విడాకులు ఇవ్వ‌డం..పెళ్లి చేసుకోవ‌డం.. విడాకులు ఇవ్వ‌డం..ఇలా ఒకే అమ్మాయిని ఏకంగా నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు ఓ ఘ‌నుడు. పెళ్లి చేసుకోవ‌డం ఎందుకు..? విడాకులు ఇవ్వ‌డం ఎందుకు..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. తైవాన్ దేశంలోని తైపై నగరంలో ఓ వ్యక్తి బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే ఆ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే ఎనిమిది రోజుల వేతనంతో కూడిన సెలవును ఇవ్వాల్సి ఉంటుంది. అదే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని స‌ద‌రు క్ల‌ర్క్.. గతేడాది ఏప్రిల్‌లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం.. అతడు ఎనిమిది రోజుల సెలవు కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే 8 రోజులు పూర్తి కాగానే భార్య‌కు డివోర్స్ ఇచ్చేశాడు. వెంట‌నే మ‌ళ్లీ పెళ్లి చేసుకుంటున్న‌ట్లు బ్యాంకులో సెల‌వులు దరఖాస్తు చేసుకున్న స‌ద‌రు వ్య‌క్తి విడుకుల ఇచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.

ఇలా ఒక‌టి, రెండు కాదు.. నాలుగు సార్లు చేశారు. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన స‌ద‌రు బ్యాంక్.. అతడికి వేతనంతో కూడిన సెలవులను ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చెప్పింది. దీంతో స‌ద‌రు వ్య‌క్తి లేబర్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో పిటిషన్ ను దాఖలు చేయ‌గా.. విచార‌ణ అనంత‌రం అతడికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు, సెల‌వుల‌ను ఇవ్వ‌మంటూ లేబర్ చట్టాలను ఉల్లంఘించినందుకు స‌ద‌రు బ్యాంకు అధికారుల‌కు జ‌రిమానా కూడా విధించారు. ఏదేమైనా స‌ద‌రు క్లర్క్ నీతిమాలిన పని చేసిన‌ప్ప‌టికీ.. అత‌డికే తీర్పు అనుకూలంగా రావ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒకే అమ్మాయిని 4 సార్లు పెళ్లాడిన వ్య‌క్తి..ఎందుకో తెలిస్తే మైండ్‌బ్లాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts