సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ‌ హాస్యనటుడు మృతి!

April 17, 2021 at 7:45 am

సినీ ఇండ‌స్ట్రీలో తాజాగా మ‌రో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్ వివేక్ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని సిమ్ ఆసుపత్రిలో చేర్పించిన సంగ‌తి తెలిసిందే. అయితే అక్క‌డ చికిత్స తీసుకుంటూ నేటి తెల్లవారుజామున క‌న్నుమూశారు.

వివేక్‌కు అకాల మరణంతో కుటుంబ‌స‌భ్యులు, అభిమానులు, సినీ ప్ర‌ముఖులు విషాదంలో మునిగిపోయారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ గుండెపోటు రావడంతో తమిళ సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ గురయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధించినా ఎవరి కోరిక తీరలేదు.. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు.

అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఇక వివేక్‌ నటన విషయానికి వస్తే.. దాదాపు ఆయన 300కి పైగా చిత్రాల్లో నటించారు. ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులోకి డ‌బ్బ అవ్వ‌డం వ‌ల్ల‌.. వివేక్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు.

సినీ ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ‌ హాస్యనటుడు మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts