వెన‌క్కి త‌గ్గిన `జాంబిరెడ్డి` హీరో..`ఇష్క్​’ విడుదల వాయిదా!

April 21, 2021 at 12:36 pm

`జాంబిరెడ్డి` సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన తేజ స‌జ్జా.. తాజా చిత్రం `ఇష్క్‌`. `నాట్‌ ఎ లవ్‌స్టోరీ` అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్రంలో తేజ స‌జ్జాకు జోడీగా ప్రియా ప్రకాశ్‌ వారియర్ న‌టిస్తోంది. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.

ఈ సినిమాను ఆర్.బి.చౌదరి సమర్పిస్తుండగా.. ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు గ‌త వార‌మే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

అయితే తాజాగా విడుదల తేదీని వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. రెండు వారాలుగా కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని, ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేస్తే బాగుండదని, నైతికంగా సరైన నిర్ణయం కాదని తేజ ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. త్వరలోనే కొత్త విడుదల తేదీతో అందరి ముందుకు వస్తామని చెప్పారు.

వెన‌క్కి త‌గ్గిన `జాంబిరెడ్డి` హీరో..`ఇష్క్​’ విడుదల వాయిదా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts