కోవిడ్ పై మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు…!

తెలంగాణలో ప్రస్తుతం 10 వేల బెడ్లకు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల చెప్పారు. గాంధీలో మరో 400 బెడ్స్ కు, టిమ్స్, వరంగల్ ఎంజీఎం హాస్పిటల్స్ లో మరో 300 చొప్పున, నిమ్స్ లో 200, సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్ హాస్పటల్ కు 200, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి 200, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 200, మంచిర్యాల జిల్లా ఆసుపత్రికి 100 చొప్పున బెడ్స్ కు ఆక్సిజన్ లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఈటల అన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో 200 ఆక్సిజన్ బెడ్స్ ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, వీఐపీల కోసం ఏర్పాటు చేయబోతున్నట్లు ఈటల తెలిపారు.

నాచారంలోని 350 ఆక్సిజన్ బెడ్స్ తో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ కోవిడ్ హాస్పిటల్ గా నేటి నుంచి సేవలందించబోతుందని ఆయన తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కరోనా ట్రీట్ మెంట్ కోసం డబ్బులు బాగా ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఈటల అన్నారు. రాష్ట్రానికి 400 మెట్రిక్‌ టన్నులకు పైగా ఆక్సిజన్‌ కేటాయింపులున్నాయని ఆయన తెలిపారు. కరోనా పేషంట్ల చికిత్సలకు చార్జీలను నిర్ధారిస్తూ గతంలో జారీ చేసిన జీవో ఇప్పటికీ అమల్లో ఉంది. దాని ప్రకారమే వసూలు చేయాలన్నారు ఆయన.