ఉగాది స్పెష‌ల్‌..`ఆర్ఆర్ఆర్‌` నుంచి న్యూ పోస్ట‌ర్ విడుద‌ల‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్‌ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. అక్టోబర్ 13 న దాసర కానుకగా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఉగాది పండ‌గ సంద‌ర్భంగా ఈ చిత్రం నుంచి ఓ అదిరిపోయే పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది.

ఈ పోస్టర్లో కొమురం భీం, సీతారామరాజు సంబరాల్లో పాల్గొంటున్నట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి మ‌రియు మెగా అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. మరి ఈ పోస్ట‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

Image