వైర‌ల్‌ అవుతున్న వ‌కీల్ సాబ్ ప్రోమో..!?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్. ఒక వైపు ధియేట‌ర్స్‌లో హల్చల్ చేస్తుంటే మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన స‌న్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేక‌ర్స్ మూవీ పై ఇంకా అంచ‌నాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగా ఆకర్షిస్తుంది.

వ‌కీల్ సాబ్ సినిమాని వేణు శ్రీరామ్ తెర‌కెక్కించ‌గా, ఇందులో నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల ముఖ్య పాత్ర‌లో నటించారు. శృతిహాస‌న్ ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఏప్రిల్ 9న రిలీజ్ అయిన ఈ చిత్రం రికార్డ్ల మోత మోగిస్తుంది. దిల్ రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా కలిసి నిర్మించిన ఈ సినిమా భవిష్యతులో మరిన్ని రికార్డులు బ్రేక్ చేయ‌డం పక్కా అంటున్నారు మూవీ విశ్లేక్షకులు.