మాన‌వ‌త్వాన్ని చాటుకున్న తమిళ్ సూప‌ర్ స్టార్..!

April 29, 2021 at 12:56 pm

ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో అందరికి మేము ఉన్నామనే భరోసా క‌ల్పిస్తున్నారు సినీ నటులు. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో అందరి ప‌రిస్థితి ధైన్యంగా మారింది.ఈ క్ర‌మంలో ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖులు విరాళాలు అందిస్తూ తమ మాన‌వ‌త్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ ఆస్పత్రుల్లో రోగులకు సహాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు, వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే కార్మికులకు అవసరమైన మాస్కులను అందించారు తమిళ్ హీరో విజయ్. అంతేకాక విజయ్‌ ఆదేశాలతో ఆయన కార్యదర్శి బుస్సీ ఎన్‌.ఆనంద్‌ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, కడలూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ ఆధ్వర్యంలో జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్బాస్‌ మంగళవారం నుండి తమ సేవలను ప్రారంభించారు.

మాన‌వ‌త్వాన్ని చాటుకున్న తమిళ్ సూప‌ర్ స్టార్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts