‘విజయ రాఘవన్’ రిలీజ్‌ డేట్‌ ఖరారు..!

April 17, 2021 at 1:28 pm

విజయ్ ఆంటోనీ భారతీయ సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్ ఇంకా చిత్ర నిర్మాత కూడా. తన తొలి చిత్రం 2012 లో నాన్ అయినప్పటికీ అతను సలీం, పిచైకరన్, సైతాన్ , యమన్, కొలైగరన్ వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం విజయ రాఘవన్. ఇందులో ఆత్మిక హీరోయిన్‌గా నటించారు. ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వంలో టీడీ రాజా, డీఆర్‌ సంజయ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. విజయ రాఘవన్‌ సినిమాని మే 14న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విజయ్‌ ఆంటోని మాట్లాడుతూ ఓ మాస్‌ ఏరియాలో పిల్లలు పక్కదారులు పట్టకుండా చదువు గొప్పతనాన్నిచెపుతూ, ఆ పిల్లల ఉన్నతికి పాటుపడే ఒక యువకుడి కథే విజయ రాఘవన్‌. మే 14న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం అని అన్నారు.

‘విజయ రాఘవన్’ రిలీజ్‌ డేట్‌ ఖరారు..!
0 votes, 0.00 avg. rating (0% score)