సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!

April 15, 2021 at 1:38 pm

కన్నడ పాపులర్ స్టార్ కిచ్చ సుదీప్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ విక్రాంత్ రోణ. సుదీప్ ఫాన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ తేదీని తాజాగా ప్రకటించారు మూవీ మేకర్స్. ఈ మూవీ నుంచి ఏప్రిల్ 15న ఒక సర్ప్రైజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించగా, మూవీ టీజర్ విడుదల అవుతుందని అంతా అనుకున్నారు కానీ మేకర్స్ సినిమా రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేశారు.

 

ఆగష్టు 19న విక్రాంత్ రోణ ప్రేక్షకులను అలరించనున్నాడు అంటూ చెప్పారు మేకర్స్. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ, మలయాళంతో పాటు మరో ఐదు విదేశీ భాషల్లో, దాదాపు 50 దేశాల్లో భారీ రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం పై సుదీప్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని జాన్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్నారు.

సుదీప్ “విక్రాంత్ రోణ” రిలీజ్ డేట్ ఖరారు..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts