కోహ్లీని ఎత్తి పడేసిన అనుష్క..వీడియో వైర‌ల్‌!

April 7, 2021 at 5:39 pm

భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ అనుష్క శర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2017 వివాహం చేసుకుని ఒక్క‌టైన ఈ జంట‌.. మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ క‌పుల్స్‌లో ఒక‌రు. ఒక ఇటీవ‌లె విరుష్క దంప‌తులు త‌ల్లిదండ్రులు కూడా అయ్యారు.

ఈ ఏడాది ఆరంభంలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా.. ఆమెకు వామిక అని నామ‌క‌ర‌ణం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. అనుష్క శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్ర‌మ్‌లో షేర్ చేసిన ఓ వీడియో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీని.. వెనుక నుంచి కౌగిలించుకున్న అనుష్క వెంట‌నే త‌న రెండు చేతుల‌తో పైకి లేపేశారు.

అనుష్క లిఫ్టింగ్ స్టంట్స్ చూసిన ఒకింత షాకైన కోహ్లీ.. మ‌రోసారి పైకి లేపాలంటూ కోరాడు. దాంతో ఎటువంటి హెల్ప్ తీసుకోకుండానే.. మ‌ళ్లీ విరాట్‌ను త‌న చేతుల‌తో ఎత్తి ప‌డేసింది. అనంత‌రం అనుష్క యాహూ అంటూ ఆనంద‌ప‌డిపోయింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

కోహ్లీని ఎత్తి పడేసిన అనుష్క..వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts