`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైర‌ల్‌!

April 13, 2021 at 9:21 am

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహద్‌ ఫాజిల్ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతోంది.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం టీజ‌ర్ ఇటీవ‌లె విడుద‌ల కాగా.. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా మాస్ లుక్‌లో తెగ ఆక‌ట్టుకున్నాడు. అలాగే ఈ టీజ‌ర్‌లో తగ్గేదే లే అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా పుష్పరాజ్ లుక్‌లోకి మారిపోయాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ఇటీవ‌లె ఐపీఎల్ 2021 ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్‌ను విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడింది. ఈ క్ర‌మంలోనే విరాట్ ఫొటోను పుష్ప రాజ్ లుక్కులోకి మార్చేసి తగ్గేదే లే… ప్రారంభం అదిరింది అంటూ స్టార్ క్రికెట్ ఛానెల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట‌ర్ వైర‌ల్‌గా మారింది.

allu arjun,virat kohli,allu arjun pushpa teaser,virat kohli royal challengers bangalore,virat kohli RCB vs MI,virat kohli as allu arjun in pushpa,allu arjun lifestyle,pushpa allu arjun movie updates,allu arjun pushpa movie crazy look,అల్లు అర్జున్ పుష్ప,విరాట్ కోహ్లీ పుష్ప,పుష్ప పాత్రలో విరాట్ కోహ్లీ

`పుష్ప రాజ్`గా మారిపోయిన కోహ్లీ..ఫొటో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts