టీడీపీలో మ‌రో విషాదం..క‌రోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!

April 26, 2021 at 10:10 am

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ వికృత రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో లక్ష‌ల మందిని బ‌లి తీసుకున్న ఈ క‌రోనా.. ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది.

తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గ‌త కొద్ది రోజుల క్రిత‌మే క‌రోనా బారిన పడ్డారు. దీంతో హాస్ప‌ట‌ల్‌లో చేరి చికిత్స పొందుతున్న రవికుమార్.. సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో విశాఖ టీడీపీలో తీవ్ర విషాదం నెల‌కొంది. ర‌వికుమార్ అంత్య‌క్రియ‌లు ఈ రోజు సాయంత్రం జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది.

టీడీపీలో మ‌రో విషాదం..క‌రోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts